ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

వేదాలే మన సంస్కృతికి మూలస్తంభాలు

వేదవిద్వత్‌ సభలో దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు… దుర్గాష్టమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఘనంగా కార్యక్రమం… 450 మంది వేదపండితులకు దేవస్థానం ఆధ్వర్యంలో సత్కారం…

V10TV న్యూస్ డెస్క్ 18 అక్టోబర్, 2026 7:41 PMకి 4,089 వీక్షణలు
వేదాలే మన సంస్కృతికి మూలస్తంభాలు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 18: మన సంస్కృతికి, ఆధ్యాత్మిక జీవనానికి వేదాలే మూలస్తంభాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు అన్నారు. సమస్త మానవాళి శ్రేయస్సు, విశ్వశాంతిని కాంక్షించే జీవన విజ్ఞానం వేదాలు, ఉపనిషత్తుల్లో నిక్షిప్తమై ఉందని పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా దుర్గాష్టమిని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం ఇంద్రకీలాద్రిపై శ్రీ మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తులో నిర్వహించిన ‘వేదవిద్వత్‌ సభ’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ప్రాచీన వేద సంప్రదాయాన్ని, ఉచ్ఛారణ శుద్ధితో కూడిన మౌఖిక పరంపరను తరతరాలుగా పరిరక్షిస్తున్న వేదపండితుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంలో పండితులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. లోకకల్యాణార్థం వేదపారాయణాలు నిర్వహిస్తున్న పండితులను సత్కరించుకోవడం సంతోషంగా ఉందని దేవస్థానం ఈవో శీనా నాయక్‌ పేర్కొన్నారు. వేద సంరక్షణే ధర్మ సంరక్షణ అని దేవస్థానం చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 450 మంది ఘనపాఠీలు, క్రమపాఠీలు, వేదపండితులను దేవస్థానం తరఫున అధికారులు ఘనంగా సత్కరించారు. శాలువాలు కప్పి అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలు, జ్ఞాపికలు అందజేశారు. చింతపల్లి ఆంజనేయ ఘనపాఠి సభా నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించగా, వేదపారాయణం అనంతరం స్వస్తి, ఆశీర్వచన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్‌ రామచంద్ర మోహన్‌, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్‌ శర్మ, ధర్మకర్తల మండలి సభ్యులు సరోజినీదేవి, పద్మావతి ఠాకూర్‌, సరిత, రాఘవరాజు, శ్రీనివాసరావు, సహాయ కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ కె. గంగాధర్‌, పర్యవేక్షకులు హేమదుర్గాంబ, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

3 నిమిషాల క్రితం 4,897

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

14 గంటల క్రితం 4,086

నామినేషన్లకూ ముందుకు రాని వైసీపీ: మంత్రి

14 గంటల క్రితం 2,256

సంక్షేమ పథకాలే కూటమి పాలనకు నిదర్శనం

15 గంటల క్రితం 4,877