నామినేషన్లకూ ముందుకు రాని వైసీపీ: మంత్రి
రాయచోటి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుపై మంత్రి ప్రకటన… వైసీపీ నేతల గత తప్పులకు ప్రజలు బుద్ధి చెబుతున్నారని వ్యాఖ్య… పలు మున్సిపాలిటీల్లో నామినేషన్లపై మంత్రి స్పందన… రాయచోటి, అక్టోబర్

రాయచోటి, అక్టోబర్ 18: రాయచోటి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవ విజయం సాధించారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. వైసీపీ నేతలు గతంలో చేసిన తప్పులకు ప్రజలు బుద్ధి చెబుతున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు కూడా ముందుకు రాని పరిస్థితి ఉందని ఆయన ఎద్దేవా చేశారు. పుంగనూరు, దర్శి, కమలాపురం, గురజాల మున్సిపాలిటీల్లో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేదని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లోనూ కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు.

