ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

ఇంటింటికీ భరోసా.. పేదల ముఖాల్లో ఆనందం

11వ డివిజన్‌లో పింఛన్లు పంపిణీ చేసిన ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె… స్థానిక సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు… ఇళ్ల పట్టాలతో పేద కుటుంబాలకు శాశ్వత భరోసా కల్పించామని వెల్లడి…

V10TV న్యూస్ డెస్క్ 1 అక్టోబర్, 2026 4:47 PMకి 3,261 వీక్షణలు
ఇంటింటికీ భరోసా.. పేదల ముఖాల్లో ఆనందం — చిత్రం 1
ఇంటింటికీ భరోసా.. పేదల ముఖాల్లో ఆనందం — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబరు 1: పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని), తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పేర్కొన్నారు. గురువారం తూర్పు నియోజకవర్గంలోని 11వ డివిజన్‌ రెల్లీస్‌ కాలనీలో నిర్వహించిన ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్‌ నగదును అందజేశారు. అంతకుముందు వార్డు సభ నిర్వహించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ప్రస్తావించిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ప్రతి నెలా ఒకటో తేదీన ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్లు అందజేస్తున్నామని చెప్పారు. పేదల ముఖాల్లో ఆనందం చూడాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా కార్యక్రమం కొనసాగుతోందన్నారు. పట్టాల పంపిణీ చరిత్రాత్మకం విజయవాడలో నిర్వహించిన ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని ఎంపీ పేర్కొన్నారు.

ఇంటింటికీ భరోసా.. పేదల ముఖాల్లో ఆనందం — అదనపు చిత్రం 2

తూర్పు, సెంట్రల్‌, పశ్చిమ నియోజకవర్గాల్లోని వేలాది పేద కుటుంబాలకు శాశ్వత ఆస్తి హక్కులు లభించాయన్నారు. పట్టాల మంజూరుకు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చూపిన చొరవ అభినందనీయమని కొనియాడారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ పేదల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అగ్రస్థానం ఇస్తోందన్నారు. విజయవాడలో 26 వేల ఇళ్ల పట్టాల పంపిణీతో పేద కుటుంబాలను లక్షాధికారులుగా మార్చామని పేర్కొన్నారు. గతంలో రెల్లీస్‌ కాలనీ భూములకు పట్టాలు ఇచ్చేందుకు ఉన్న అడ్డంకులను ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. ఎంపీ కేశినేని చిన్ని, నగర ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, సుజనా చౌదరితో కలిసి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించారని చెప్పారు. ఆరు నెలలపాటు అధికారులు శ్రమించి అర్హులకు పట్టాలు అందించారని తెలిపారు. ఈ పట్టాలతో బ్యాంకు రుణాలు పొందడంతోపాటు పిల్లల భవిష్యత్తుకు ఆస్తిని వినియోగించుకునే అవకాశం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086