ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

గాంధీజీ ఆశయాల ఆచరణే నిజమైన నివాళి: బాజీ బాబా

నైజాం గేట్‌ సెంటర్‌లో జాతిపితకు ఘన నివాళి… సత్యం, అహింస, సామాజిక సమానత్వమే ఆయన సందేశమని వెల్లడి… గాంధీ జయంతి సందర్భంగా పేదలకు పండ్ల పంపిణీ…

V10TV న్యూస్ డెస్క్ 2 అక్టోబర్, 2026 12:49 PMకి 2,546 వీక్షణలు
గాంధీజీ ఆశయాల ఆచరణే నిజమైన నివాళి: బాజీ బాబా — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 2: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని నైజాం గేట్‌ సెంటర్‌లో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శి, మైనారిటీ నాయకుడు బాజీ బాబా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాజీ బాబా మాట్లాడుతూ.. సత్యం, అహింస, శాంతి, సామాజిక సమానత్వం వంటి విలువలను గాంధీజీ జీవితాంతం ఆచరించి దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరంలో ఆయన నాయకత్వం దేశ ప్రజల్లో ఐక్యతను, స్వాతంత్ర్య కాంక్షను బలోపేతం చేసిందన్నారు. అహింసా మార్గంలో ప్రజలను ఏకం చేసి స్వాతంత్ర్య ఉద్యమానికి గాంధీజీ అందించిన నాయకత్వం భారత చరిత్రలో చిరస్మరణీయమని తెలిపారు. గాంధీజీ కలలుగన్న సమాజంలో పేదలు, బలహీనవర్గాలు, మైనారిటీలతోపాటు ప్రతి ఒక్కరికీ సమాన గౌరవం, హక్కులు, అవకాశాలు లభించాలని ఆకాంక్షించారు. గాంధీజీ ఆశయాలను ప్రజల జీవితాల్లో ఆచరణలోకి తీసుకురావడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని చెప్పారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ రాష్ట్ర డైరెక్టర్‌ డేరంగుల రమణ, క్రిస్టియన్‌ మైనారిటీ నాయకుడు బత్తుల పాండు, పశ్చిమ మహిళా అధ్యక్షురాలు భవాని, రాష్ట్ర బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి గోలగాని శ్రీనివాసరావు, రాష్ట్ర మున్సిపల్‌ విభాగం ప్రధాన కార్యదర్శి పైడా శ్రీనివాసరావు, ఏనుగుల సునీల్‌, మజ్జి శీను, నజీరుద్దీన్‌, షేక్‌ అహ్మద్‌, అబ్దుల్‌ గని, పల్లె బాబు, అబ్దుల్‌ సత్తార్‌, అబ్దుల్‌ రెహమాన్‌, షేక్‌ బాషా, సయ్యద్‌ జాకీర్‌, రసూల్‌, అబ్దుల్లా గౌసి, ఖాదర్‌ బాషా, మహమ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

55 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086