ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చొరవతో విద్యార్థులకు ప్రత్యేక బస్సు సౌకర్యం
విద్యార్థుల విజ్ఞప్తికి ఐదు రోజుల్లోనే స్పందించి స్పెషల్ బస్సు ఏర్పాటు... నందివాడ నుంచి గుడివాడ వరకు విద్యార్థులతో కలిసి ప్రయాణించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము... సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని విద్యార్థులకు హామీ..


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
నందివాడ, ఆగస్టు 6 (వి10 టీవీ): గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చొరవతో నందివాడ మండల విద్యార్థుల కోసం కాలింగ్పేట–గుడివాడ ప్రత్యేక స్టూడెంట్ బస్సు సర్వీస్ గురువారం ప్రారంభమైంది. ఇటీవల ప్రజావేదికలో విద్యార్థులు రవాణా సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, కేవలం ఐదు రోజుల్లోనే ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేసి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. అనంతరం ఎమ్మెల్యే

వెనిగండ్ల రాము నందివాడ నుంచి గుడివాడ వరకు విద్యార్థులతో కలిసి బస్సులో ప్రయాణిస్తూ వారి సమస్యలు, విద్యా వసతులపై ఆరా తీశారు. భవిష్యత్తులో కూడా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రత్యేక బస్సు సర్వీస్ ప్రారంభం కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు కృతజ్ఞతలు తెలిపారు.

