అంధులకు ఆశాకిరణం.. 'బ్లైండ్‌సైట్'తో కొత్త చూపు!
అంధులకు చూపునిచ్చే బ్రెయిన్ విజన్ ఇంప్లాంట్‌ను అభివృద్ధి చేస్తున్న న్యూరాలింక్... దెబ్బతిన్న కళ్లను దాటుకుని నేరుగా మెదడుకు దృశ్య సమాచారాన్ని పంపనున్న చిప్... 6–12 నెలల్లో మానవ పరీక్షలు.. ఇప్పటికే అమెరికా FDA నుంచి 'బ్రేక్‌థ్రూ డివైజ్' హోదా...

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని న్యూరాలింక్ సంస్థ అంధులకు మళ్లీ చూపునిచ్చే లక్ష్యంతో 'బ్లైండ్‌సైట్' (Blindsight) అనే అత్యాధునిక విజన్ ఇంప్లాంట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ చిప్ దెబ్బతిన్న కళ్లపై ఆధారపడకుండా నేరుగా మెదడులోని విజువల్ కార్టెక్స్‌కు దృశ్య సమాచారాన్ని పంపే విధంగా రూపొందిస్తున్నట్లు మస్క్ తెలిపారు. రాబోయే 6 నుంచి 12 నెలల్లో ఈ పరికరంపై మానవ పరీక్షలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఈ సాంకేతికతకు అమెరికా FDA నుంచి 'బ్రేక్‌థ్రూ డివైజ్' హోదా లభించడంతో, అంధుల జీవితాల్లో విప్లవాత్మక మార్పుకు ఇది నాంది పలకవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

