బౌద్ధ సంప్రదాయంలో సామాజిక చైతన్య మంగళ పరిణయం
బాబాసాహెబ్ అంబేడ్కర్ సాక్షిగా ఒక్కటైన బంటీ–నాగమణి వివాహాన్ని నిర్వహించిన లార్డ్ బుద్ధ దమ్మ ప్రచార ట్రస్ట్ చైర్మన్ మత్తే బాబి

ఏలూరు: బహుజన సేన ప్రధాన కార్యాలయంలో బౌద్ధ సంప్రదాయం ప్రకారం సామాజిక చైతన్య మంగళ పరిణయం ఘనంగా జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్రపటం సాక్షిగా వరుడు మర్రిపూడి బంటీ, వధువు బలే షణ్ముఖ నాగమణి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. లార్డ్ బుద్ధ దమ్మ ప్రచార ట్రస్ట్ చైర్మన్ మత్తే బాబి వివాహకర్తగా వ్యవహరించి బౌద్ధ సంప్రదాయ పద్ధతుల్లో వివాహాన్ని నిర్వహించారు. కులాంతర వివాహాల ద్వారా సమానత్వం, సోదరభావం, సామాజిక ఐక్యత మరింత బలపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. నూతన దంపతులకు బహుజన సేన ప్రతినిధులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శుభాకాంక్షలు తెలిపారు. జై భీమ్! నమో బుద్ధాయ! బహుజన సేన — రేపటి తరం కోసం రిజిస్ట్రేషన్ నంబరు: 277/2023 సంప్రదించాల్సిన నంబరు: 9347355557 ఏలూరు–1

