శ్రీకృష్ణుడి బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకం
పశ్చిమ నియోజకవర్గంలో కృష్ణాష్టమి వేడుకలు పలు డివిజన్లలో ఎంపీ కేశినేని చిన్ని, బుద్ధా వెంకన్న పర్యటన ప్రజలు, భక్తులకు పర్వదిన శుభాకాంక్షలు



1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబర్ 4 (ఆంధ్రప్రభ): శ్రీకృష్ణుడి బోధనలు ప్రజలను ధర్మం, న్యాయం, సత్యం వైపు నడిపిస్తాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో నిర్వహించిన వేడుకల్లో ఆయనతోపాటు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బుద్ధా వెంకన్న పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరై శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. ప్రజలు, భక్తులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలను కలుసుకుని కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, శ్రీకృష్ణుడి బోధనలు నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. బుద్ధా వెంకన్న మాట్లాడుతూ, కృష్ణాష్టమి పర్వదినం పశ్చిమ


నియోజకవర్గ ప్రజల జీవితాల్లో ఆనందం, శాంతి, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని శ్రీకృష్ణుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజల పండుగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సుఖదుఃఖాల్లో అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పారు. కృష్ణాష్టమి సందర్భంగా 40వ డివిజన్‌లో చిన్న సుబ్బయ్య, 43వ డివిజన్‌లో ఎం.రాంబాబు, మల్లిబోయిన కొండ, కె.కొండయ్య, ఏడుకొండలు, 47వ డివిజన్‌లో నమ్మిన భాను, నెహ్రూ బొమ్మ సెంటర్‌లోని వేణుగోపాలస్వామి ఆలయం వద్ద బుర్ర కనకరావు, 56వ డివిజన్‌లో శ్యామ్‌సుందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎంపీ కేశినేని చిన్ని, బుద్ధా వెంకన్న పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక టీడీపీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

