ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

విజయవాడ ఉత్సవ్‌లో వైభవంగా దేవీ నవరాత్రి పూజలు

సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు… అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ కేశినేని చిన్ని సతీమణి జానకి లక్ష్మి… ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలకు విజయవాడ ఉత్సవ్‌ వేదిక…

V10TV న్యూస్ డెస్క్ 11 అక్టోబర్, 2026 9:11 PMకి 3,256 వీక్షణలు
విజయవాడ ఉత్సవ్‌లో వైభవంగా దేవీ నవరాత్రి పూజలు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 11: విజయవాడ ఉత్సవ్‌ 2.0లో భాగంగా నగరంలోని సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో ఆదివారం దేవీ శరన్నవరాత్రి పూజలు వైభవంగా నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల తొలిరోజు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) సతీమణి జానకి లక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య జరిగిన పూజా కార్యక్రమాల్లో ఆమె భక్తిశ్రద్ధలతో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా జానకి లక్ష్మి మాట్లాడుతూ విజయవాడ నగరానికి ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు ఐక్యతను, సంప్రదాయాలను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవ్‌ ద్వారా నగర ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రజలకు చేరువ చేయడంతో పాటు భావితరాలకు సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేసే అవకాశం కలుగుతుందన్నారు. ప్రజలందరూ నవరాత్రి ఉత్సవాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవ్‌ను మరింత వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086