విజయవాడ ఉత్సవ్–2.0కు వీహెచ్‌పీ నేతలకు ఆహ్వానం
విశ్వ హిందూ పరిషత్ ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలిసిన నిర్వాహకులు… ఉత్సవాల్లో పాల్గొనాలని నేతలకు ఆహ్వాన పత్రాల అందజేత…

విజయవాడ, అక్టోబర్ 10: విజయవాడ ఉత్సవ్ సీజన్–2 కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ ప్రముఖులను నిర్వాహకులు ఆహ్వానించారు. సత్యనారాయణపురంలోని విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర ప్రాంత కార్యాలయంలో క్షేత్ర ప్రచారక్ గుమ్మళ్ల సత్యం, ఆంధ్రప్రదేశ్ సంఘటన మంత్రి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తరాంధ్ర కార్యదర్శి భూపతిరాజు సుబ్బరాజు, ప్రాంత కోశాధికారి దుర్గాప్రసాద్‌రాజు, విజయవాడ కార్యదర్శి పొట్టి శ్రీహరి, సహ కార్యదర్శి కొంపెల్లి శ్రీనివాస్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయవాడ ఉత్సవ్ సీజన్–2 కార్యక్రమానికి హాజరుకావాలని వారిని ఆహ్వానించారు.

