దేశభక్తి ప్రతి ఒక్కరి బాధ్యత: గవర్నర్‌పేట సీఐ బాలమురళీకృష్ణ
గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు... పోలీస్ సిబ్బందితో కలిసి జాతీయ పతాకానికి ఘన వందనం... చిన్నారుల సందడితో వేడుకల్లో వెల్లివిరిసిన దేశభక్తి...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, ఆగస్టు 15 — V10TV: దేశభక్తి అంటే కేవలం జాతీయ పతాకానికి వందనం చేయడమే కాదని, దేశం పట్ల బాధ్యతతో మెలగడం, చట్టాలను గౌరవించడం, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా జీవించడం కూడా నిజమైన దేశభక్తేనని గవర్నర్‌పేట సీఐ బాలమురళీకృష్ణ అన్నారు.
గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్లో సీఐ బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించి స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.
వేడుకలకు ప్రత్యేకంగా హాజరైన చిన్నారులు సందడి చేశారు. పోలీస్ అధికారులు, సిబ్బంది చిన్నారులతో కలిసి స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకోవడంతో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో దేశభక్తి వాతావరణం వెల్లివిరిసింది.

ఈ సందర్భంగా సీఐ బాలమురళీకృష్ణ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయులను ప్రతి భారతీయుడు స్మరించుకోవాలన్నారు. స్వాతంత్య్రం మనకు హక్కులను ఇవ్వడంతో పాటు దేశం పట్ల బాధ్యతలను కూడా అప్పగించిందని పేర్కొన్నారు.
ముఖ్యంగా చిన్నారుల్లో బాల్యం నుంచే దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, చట్టాల పట్ల గౌరవం వంటి విలువలను పెంపొందించాలన్నారు. నేటి బాలలే రేపటి భారతదేశ భవిష్యత్తని, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్ అధికారులు, పోలీస్ సిబ్బంది, చిన్నారులు పాల్గొన్నారు.

