ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ15, ఆగస్టు 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

డ్వాక్రా మహిళకు రూ.50 వేల విలువైన ఎగ్ కార్ట్ అందజేత

లబ్ధిదారు శివనాగ కుమారికి స్వయం ఉపాధి కోసం చేయూత... ఎగ్ కార్ట్ అందజేసిన అడ్డూరి శ్రీరామ్, ప్రత్తిపాటి శ్రీధర్... మహిళల ఆర్థిక స్వావలంబనే కూటమి ప్రభుత్వ లక్ష్యం: అడ్డూరి శ్రీరామ్...

V10TV న్యూస్ డెస్క్ 15 ఆగస్టు, 2026 5:24 PMకి 1,452 వీక్షణలు
డ్వాక్రా మహిళకు రూ.50 వేల విలువైన ఎగ్ కార్ట్ అందజేత — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

ఆగస్టు 15 — V10TV AP: మహిళా సాధికారత, స్వయం ఉపాధి కల్పనే లక్ష్యంగా డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం చేయూతనిస్తోందని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ తెలిపారు. భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో శనివారం డ్వాక్రా మహిళ శివనాగ కుమారికి రూ.50 వేల విలువైన ఎగ్ కార్ట్‌ను ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్‌తో కలిసి ఆయన అందజేశారు.

ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ మెప్మా ఆధ్వర్యంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కృషి చేస్తున్నారని తెలిపారు. మహిళలు సొంతంగా వ్యాపారాలు నిర్వహిస్తూ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేలా ఇటువంటి ఉపాధి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నామన్నారు.

రూ.50 వేల విలువైన ఎగ్ కార్ట్ అందుకోవడంపై లబ్ధిదారు శివనాగ కుమారి సంతోషం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి, ఎమ్మెల్యే సుజనా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో ఆర్‌పీ భవాని, ఎన్డీయే కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

పులస కాదు.. పిత! పుస్తెలతాడు తాకట్టు పెట్టి జాతిపితకు గౌరవం

21 నిమిషాల క్రితం 1,237

దేశభక్తి ప్రతి ఒక్కరి బాధ్యత: గవర్నర్‌పేట సీఐ బాలమురళీకృష్ణ

24 నిమిషాల క్రితం 3,710

జాతీయ భావంతోనే దేశం మరింత బలపడుతుంది: ఏసీపీ దైవప్రసాద్

59 నిమిషాల క్రితం
3,285

గ్రేటర్ విజయవాడ.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?గ్రేటర్ విజయవాడ మన హక్కు – మన భవిష్యత్తు

1 గంట క్రితం 1,246