ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

బొట్టు పెట్టి పట్టాభిషేకానికి ఆహ్వానం

లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ దంపతులు పేదలకు శాశ్వత ఆస్తి హక్కు కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం ఈ నెల 30న మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో పట్టాల పంపిణీ

V10TV న్యూస్ డెస్క్ 27 సెప్టెంబర్, 2026 4:36 PMకి 3,241 వీక్షణలు
బొట్టు పెట్టి పట్టాభిషేకానికి ఆహ్వానం — చిత్రం 1
బొట్టు పెట్టి పట్టాభిషేకానికి ఆహ్వానం — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్ 27: పేదలకు ఇంటి స్థలాలపై శాశ్వత యాజమాన్య హక్కు కల్పించేందుకు ఈ నెల 30న నిర్వహించనున్న పేదలకు పట్టాభిషేకం కార్యక్రమానికి లబ్ధిదారులను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్, గద్దె అనురాధ దంపతులు వినూత్నంగా ఆహ్వానించారు. ఆదివారం క్రీస్తురాజుపురంలో లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి మహిళలకు బొట్టు పెట్టారు. అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగే పట్టాల పంపిణీ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా గద్దె రామమోహన్ మాట్లాడుతూ ఏళ్లుగా నివాసముంటున్న పేదలకు ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రిజిస్టర్డ్ పట్టాలు అందిస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికీ ఆస్తిపై చట్టబద్ధమైన హక్కు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మార్కెట్ విలువ ప్రకారం గజం రూ.లక్షగా ఉంటే 50 గజాల స్థలం విలువ రూ.50 లక్షలు ఉంటుందని, 220 గజాల స్థలం పొందిన కుటుంబానికి రూ.2.20

బొట్టు పెట్టి పట్టాభిషేకానికి ఆహ్వానం — అదనపు చిత్రం 2

కోట్ల విలువైన ఆస్తి లభిస్తుందని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంతో పేద కుటుంబాలు ఇకపై ఇది మా భూమి మా ఇల్లు అని గర్వంగా చెప్పుకునే అవకాశం లభించిందన్నారు. పట్టాల పంపిణీ పేదలకు నాలుగు పండుగలు ఒకేసారి వచ్చినంత ఆనందాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పేదల ఆస్తి హక్కులకు భరోసా కల్పిస్తోందన్నారు. లబ్ధిదారులందరూ ఈ నెల 30న జరిగే కార్యక్రమానికి హాజరై పట్టాలు స్వీకరించాలని గద్దె రామమోహన్, గద్దె అనురాధ కోరారు. కార్యక్రమంలో గద్దె రాజేష్, మూప్పూరి కల్యాణి, నందిపాటి దేవానంద్, కాకాని తరుణ్, దయాల శిరీషా గాంధీ, బచ్చలకూరి అజయ్‌కుమార్, దోమకొండ రవి, యలమంచిలి రాజేష్, ఆలుబల్లి రామకృష్ణ, చిరుకూరి మల్లికార్జునరావు, షరీఫ్, రాచమళ్ల ఆంజనేయులు, కోడూరు సుబ్రహ్మణ్యం, షేక్ షకీలా, గల్లా రవి తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086