పవిత్ర సంగమానికి గోదావరి జలకళ
ఇబ్రహీంపట్నం వద్ద పెరుగుతున్న గోదావరి జలాల ప్రవాహం పవర్‌స్టేషన్ గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కృష్ణా నదిలో కలుస్తున్న గోదావరి జలాలు

విజయవాడ, సెప్టెంబర్ 25: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇబ్రహీంపట్నం పవర్‌స్టేషన్ వద్ద గోదావరి జలాల ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు చేరుతుండటంతో పవర్‌స్టేషన్ గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరు ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలో కలుస్తోంది. వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

