ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

ఇళ్ల మధ్య ఆక్సిజన్ సిలిండర్ లీకేజీ.. వాహనాల ధ్వంసం

అదుపుతప్పి దూసుకెళ్లిన సిలిండర్.. రెండు బైక్‌లు, కారు ధ్వంసం... ఘటనలో ఇద్దరికి గాయాలు.. ఈడేపల్లిలో భయాందోళన... నివాసాల మధ్య సిలిండర్ నిల్వలపై స్థానికుల ఆగ్రహం.. చర్యలకు డిమాండ్...

V10TV న్యూస్ డెస్క్ 12 ఆగస్టు, 2026 11:43 AMకి 1,141 వీక్షణలు
ఇళ్ల మధ్య ఆక్సిజన్ సిలిండర్ లీకేజీ.. వాహనాల ధ్వంసం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

మచిలీపట్నం, ఆగస్టు 12: మచిలీపట్నం ఈడేపల్లిలో బుధవారం ఆక్సిజన్ సిలిండర్ లీకేజీ కలకలం రేపింది. బెల్ కంపెనీ వెనుక ప్రాంతంలో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ నుంచి ఒక్కసారిగా గ్యాస్ లీక్ కావడంతో సిలిండర్ అదుపుతప్పి వేగంగా దూసుకెళ్లింది. నివాసాల మధ్య ఈ ఘటన జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సిలిండర్ వేగంగా దూసుకెళ్లి సమీపంలో నిలిపి ఉంచిన రెండు బైక్‌లు, ఒక కారును ఢీకొట్టడంతో అవి ధ్వంసమైనట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడినట్లు పేర్కొన్నారు. ఒక్కసారిగా భారీ శబ్దంతో సిలిండర్ దూసుకెళ్లడంతో ఏం జరుగుతుందో తెలియక స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. సమీపంలో పెద్ద సంఖ్యలో నివాసాలు ఉన్నప్పటికీ పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఘటన జరిగిన చాలా సమయం గడిచినా సంబంధిత షాపు నిర్వాహకులు లేదా బాధ్యులు అక్కడికి రాలేదని స్థానికులు ఆరోపించారు. జనావాసాల మధ్య ఆక్సిజన్ సిలిండర్లను నిల్వ చేయడం అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నివాస ప్రాంతాల్లో ఉన్న సిలిండర్ నిల్వ కేంద్రాలను తనిఖీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనకు సంబంధించి అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

48 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

55 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086