ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ28, ఆగస్టు 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

విద్యార్థులకు ‘ఫైర్ సేఫ్టీ’ పాఠం

అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన... పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన అగ్నిమాపక శాఖ అధికారులు... పొగ వ్యాపిస్తే నేలపై పాకుతూ బయటకు రావాలి.. సేఫ్ అసెంబ్లీ పాయింట్‌కు చేరుకోవాలని సూచన...

V10TV న్యూస్ డెస్క్ 27 ఆగస్టు, 2026 5:25 PMకి 1,365 వీక్షణలు
విద్యార్థులకు ‘ఫైర్ సేఫ్టీ’ పాఠం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, ఆగస్టు 27: విద్యార్థుల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు విజయవాడ గ్రామీణ మండలం సీతారామపురంలోని ఓ పాఠశాలలో అగ్నిమాపక శాఖ అధికారులు ఫైర్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలతో పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన అధికారులు, అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు భయాందోళనకు గురికాకుండా ఎలా సురక్షితంగా బయటపడాలో విద్యార్థులకు వివరించారు.

ముఖ్యంగా అగ్ని ప్రమాద సమయంలో పొగ వ్యాపిస్తే నిటారుగా పరుగెత్తకుండా నేలకు దగ్గరగా పాకుతూ సురక్షిత మార్గం ద్వారా బయటకు రావాలని సూచించారు. అనంతరం ముందుగా నిర్ణయించిన సేఫ్ అసెంబ్లీ పాయింట్‌కు చేరుకోవాలని తెలిపారు.

అగ్ని ప్రమాదాల నివారణ, అత్యవసర సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, సురక్షితంగా భవనం నుంచి బయటకు వచ్చే విధానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాలల్లో ఇలాంటి ఫైర్ సేఫ్టీ కార్యక్రమాలు విద్యార్థులకు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు పేర్కొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

పోలవరం రాష్ట్ర అభివృద్ధికి జీవనాడి: చిన్నపురెడ్డి రవీంద్రారెడ్డిYc

12 గంటల క్రితం 5

రేషన్ బియ్యం వద్దంటే.. ఖాతాలో డబ్బులు!

13 గంటల క్రితం 1,914

ఆరోగ్యానికి అండగా.. రూ.5.18 లక్షల ఎల్‌ఓసీ

14 గంటల క్రితం 2,325

క్లిక్‌ చేసే ముందు ఆలోచించండి.. సైబర్‌ మోసానికి చెక్‌ పెట్టండి!

14 గంటల క్రితం 3,660