ఒక్క ఓటుతో ఎమ్మెల్యేగా గెలుపు.. ఎన్నిక చెల్లుతుందన్న హైకోర్టు
టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతికి భారీ ఊరట... ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత... పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో అక్రమాలకు ఆధారాలు లేవన్న న్యాయస్థానం...

తమిళనాడులోని తిరువత్తూరు నియోజకవర్గం నుంచి కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతికి మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థి పెరియకరుప్పన్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, ఎన్నికల ఫలితాన్ని రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. అయితే ఆ ఆరోపణలను నిరూపించే సరైన ఆధారాలను సమర్పించలేకపోయారని కోర్టు పేర్కొంది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో ఒక్క ఓటుతో సాధించిన శ్రీనివాస సేతుపతి విజయం చెల్లుబాటులోనే కొనసాగనుంది.

