ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

పెడన అభివృద్ధికి రూ.12 కోట్ల హామ్ నిధులు

రూ.3.12 కోట్ల పనులకు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ శంకుస్థాపన... నాలుగు వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణం... రహదారుల సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యమని వెల్లడి...

V10TV న్యూస్ డెస్క్ 28 సెప్టెంబర్, 2026 3:42 PMకి 4,590 వీక్షణలు
పెడన అభివృద్ధికి రూ.12 కోట్ల హామ్ నిధులు — చిత్రం 1
పెడన అభివృద్ధికి రూ.12 కోట్ల హామ్ నిధులు — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

పెడన, సెప్టెంబర్ 28: పెడన పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు, అంతర్గత రహదారుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ శ్రీకారం చుట్టారు. పురపాలక సంఘానికి మంజూరైన రూ.12 కోట్ల హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ నిధులు, రూ.91 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. తొలివిడతలో భాగంగా రూ.3 కోట్ల హామ్ పనులు, రూ.12 లక్షల 15వ ఆర్థిక సంఘం పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. పట్టణంలోని 6, 9, 10, 11వ వార్డుల్లో ప్రజలకు అవసరమైన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు, అంతర్గత రహదారులను నిర్మించనున్నారు. రాకపోకలను మెరుగుపరచడంతోపాటు ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా ఈ

పెడన అభివృద్ధికి రూ.12 కోట్ల హామ్ నిధులు — అదనపు చిత్రం 2

పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రహదారుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా రోడ్లతోపాటు డ్రైనేజీ వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులతోపాటు ప్రజల భాగస్వామ్యమూ ముఖ్యమన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో పనిచేస్తే పెడనను మరింత అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఒకేసారి అభివృద్ధి పనులు ప్రారంభించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, వార్డు బాధ్యులు, ప్రజలు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086