ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

లోతట్టు ప్రాంతాల్లో బొండా ఉమా పర్యటన

సుందరయ్యనగర్‌, రాజీవ్‌నగర్‌, కండ్రిక శివారు ప్రాంతాల పరిశీలన ఇళ్లలోకి చేరిన వర్షపు నీటిని మోటార్లతో తొలగించాలని ఆదేశం కాలువల్లో గుర్రపుడెక్క, చెత్త తొలగింపునకు జేసీబీల ఏర్పాటు

V10TV న్యూస్ డెస్క్ 24 సెప్టెంబర్, 2026 1:11 PMకి 3,655 వీక్షణలు
లోతట్టు ప్రాంతాల్లో బొండా ఉమా పర్యటన — చిత్రం 1
లోతట్టు ప్రాంతాల్లో బొండా ఉమా పర్యటన — చిత్రం 2
లోతట్టు ప్రాంతాల్లో బొండా ఉమా పర్యటన — చిత్రం 3

1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్‌ 24: వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు జలమయమైన విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గురువారం పర్యటించారు. వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలను పరామర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. అరవై మూడో డివిజన్‌లోని సుందరయ్యనగర్‌, రాజీవ్‌నగర్‌తోపాటు అరవై నాలుగో డివిజన్‌ కండ్రిక శివారు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఇళ్లలో నిలిచిన నీటిని మోటార్లతో యుద్ధప్రాతిపదికన బయటకు తోడాలని అధికారులను ఆదేశించారు. కనెక్టింగ్‌ కాలువలు, డ్రైనేజీ మార్గాల్లో గుర్రపుడెక్క,

లోతట్టు ప్రాంతాల్లో బొండా ఉమా పర్యటన — అదనపు చిత్రం 2
లోతట్టు ప్రాంతాల్లో బొండా ఉమా పర్యటన — అదనపు చిత్రం 3

చెత్త పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతున్నట్లు గుర్తించారు. జేసీబీలతో వాటిని తొలగించి నీరు సాఫీగా ప్రవహించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో మోటార్లు, జేసీబీలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. వర్షాలు తగ్గేవరకు లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, నీరు నిలిచినట్లు సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అవసరమైన బాధితులకు పునరావాస కేంద్రాల్లో వసతి, భోజనం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086