ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

టీడీపీలోకి వైసీపీ నాయకులు, కార్యకర్తల చేరిక

ఎమ్మెల్యే బొండా ఉమా నాయకత్వంపై విశ్వాసంతో చేరుతున్నట్లు వెల్లడి… బొండా రవితేజ సమక్షంలో 73వ డివిజన్‌కు చెందిన సుమారు 200 మంది చేరిక… స్థానిక ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపు…

V10TV న్యూస్ డెస్క్ 16 అక్టోబర్, 2026 3:11 PMకి 4,521 వీక్షణలు
టీడీపీలోకి వైసీపీ నాయకులు, కార్యకర్తల చేరిక — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 16: విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలోని 73వ డివిజన్‌ న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. సింగ్‌నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ యువనేత బొండా రవితేజ సమక్షంలో సుమారు 200 మంది పార్టీలో చేరినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నాయకత్వం, నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న కృషిపై విశ్వాసంతో టీడీపీలో చేరినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బొండా రవితేజ మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ తాగునీరు, డ్రైనేజీ తదితర సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే బొండా ఉమా కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుతో పాటు సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్‌ సిలిండర్ల వంటి పథకాలతో అర్హులకు ప్రయోజనం కలుగుతోందని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను వివరించాలని రవితేజ పిలుపునిచ్చారు. స్థానిక సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని సూచించారు. కులమతాలకు అతీతంగా ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పార్టీలో చేరిన వారిలో షేక్‌ చాంద్‌బీ, హసీనా, షేక్‌ మాబు, సాయి, వెంకట్‌, ఎం.శ్రీను, కోలా విజయ, జాన్‌బాషా తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాగవంశ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎరుబోతు రమణారావు, డివిజన్‌ అధ్యక్షుడు షేక్‌ కబీర్‌, షేక్‌ నాగూర్‌, ఇమ్మానుయేల్‌, అప్పలనాయుడు, తిరుపతి, నాని, వేణు, గుళివిందల లీల, సరోజినీ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086