విదేశీ సేవలకు అమరావతి చిరునామా
నూతన కార్యాలయం ఏర్పాటుకు కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విదేశీ పెట్టుబడిదారులు, పర్యాటకుల రాకపోకలకు మరింత వెసులుబాటు వీసాలు, విదేశీయుల నమోదు సేవలు ఇక మరింత వేగవంతం

అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో నూతన ఇమిగ్రేషన్, విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అమరావతికి విదేశీ పెట్టుబడిదారులు, పర్యాటకుల రాకపోకలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యాలయం అందుబాటులోకి వస్తే వీసాల పొడిగింపు, విదేశీయుల నమోదు, ఇతర ఇమిగ్రేషన్ సేవలు వేగవంతం కానున్నాయి. విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ కార్యకలాపాలకు కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న అమరావతికి ఈ కార్యాలయం మరింత ప్రయోజనం చేకూర్చనుంది.

