దసరా ఉత్సవాలకు కలెక్టర్, సీపీకి ఆహ్వానం
కలెక్టర్ లక్ష్మీశకు ఆహ్వానపత్రిక అందజేసిన ఆలయ అధికారులు… సీపీ రాజశేఖరబాబును ఆహ్వానించిన దేవస్థానం పాలకవర్గం… దసరా ఉత్సవాలకు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని వినతి…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, అక్టోబరు 2: ఇంద్రకీలాద్రిపై నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశను దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్, స్థానాచార్య శివప్రసాద్ శర్మ తదితరులు ఆహ్వానించారు. ఉత్సవాల ఆహ్వానపత్రికను

కలెక్టర్‌కు అందజేశారు. అనంతరం నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబును దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్, స్థానాచార్య శివప్రసాద్ శర్మ తదితరులు కలిసి దసరా ఉత్సవాల ఆహ్వానపత్రికను అందజేశారు. ఉత్సవాలకు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.

