ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ2, నవంబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

గుడ్లవల్లేరులో కూటమి రోడ్‌షో.. బైక్ ర్యాలీతో సందడి!

ఎమ్మెల్యే రాము నేతృత్వంలో పలు గ్రామాల్లో విస్తృత ప్రచారం… అంగలూరు నుంచి రెడ్డిపాలెం వరకు రోడ్‌షో.. ఇంటింటా ఓట్ల అభ్యర్థన… అభివృద్ధి పనులను చూసి తీర్పు ఇవ్వాలన్న కొనకళ్ల బుల్లయ్య…

V10TV న్యూస్ డెస్క్ 2 నవంబర్, 2026 4:39 PMకి 6,895 వీక్షణలు
గుడ్లవల్లేరులో కూటమి రోడ్‌షో.. బైక్ ర్యాలీతో సందడి! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

గుడ్లవల్లేరు, నవంబర్ 2: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గుడ్లవల్లేరు మండలంలో కూటమి నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నేతృత్వంలో చేపట్టిన రోడ్‌షో, బైక్ ర్యాలీలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంగలూరులో ప్రారంభమైన రోడ్‌షో గుడ్లవల్లేరు, కౌతవరం, వేమవరం, వడ్లమన్నాడు మీదుగా రెడ్డిపాలెం వరకు కొనసాగింది. పలు గ్రామాల్లో మహిళలు హారతులతో నాయకులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకుడు కొనకళ్ల బుల్లయ్య, ఏపీ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన జడ్పీటీసీ అభ్యర్థి వర్రె బలరామకృష్ణ పాల్గొన్నారు. రెడ్డిపాలెం, వడ్లమన్నాడు, కొండిపర్రు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వేమవరంలో ఎమ్మెల్యే రాము, బుల్లయ్య ద్విచక్ర వాహనంపై పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ నియోజకవర్గంలో గత రెండున్నరేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసే వ్యక్తులనే కూటమి అభ్యర్థులుగా ఎంపిక చేశామన్నారు. గత వైసీపీ పాలనలో తాగునీరు వంటి కనీస సమస్యలను కూడా పరిష్కరించలేదని విమర్శించారు. రానున్న గుడివాడ మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రజలకు సేవ చేసే అభ్యర్థులకే ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. వడ్లమన్నాడులో కొనకళ్ల బుల్లయ్య మాట్లాడుతూ వ్యక్తిగత విమర్శల కంటే అభివృద్ధి పనులను పరిశీలించి ఓటర్లు నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కృష్ణా జిల్లా టీడీపీ ఎన్నికల పరిశీలకుడు బొమ్మలపాటి శ్రీధర్, జనసేన నాయకుడు బూరగడ్డ శ్రీకాంత్, మండల టీడీపీ అధ్యక్షుడు పోలవరపు వెంకటరావు, మార్కెట్ యార్డు చైర్మన్ పొట్లూరి రవి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

నిడమానూరులో పరిమి సింధూర ఆధ్వర్యంలో వైసీపీ ఎన్నికల ర్యాలీ!

1 గంట క్రితం 7,571

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు వేగవంతం!

5 గంటల క్రితం 7,531

తుపాను హెచ్చరికలతో ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తం!

5 గంటల క్రితం 6,879

మద్యం మత్తులో కన్నబిడ్డ ప్రాణాలు తీసిన తండ్రి!

5 గంటల క్రితం 7,000