ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/వైద్య రంగ వార్తలు/వార్త
వైద్య రంగ వార్తలు

విధులకు దూరంగా.. డిమాండ్ల కోసం పోరుబాట

కలెక్టరేట్‌ వద్ద వైద్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన… క్రమబద్ధీకరణ, వంద శాతం గ్రాస్‌ వేతనం పునరుద్ధరణకు డిమాండ్‌… అత్యవసర సేవలు కొనసాగిస్తూ మిగిలిన విధుల బహిష్కరణ…

V10TV న్యూస్ డెస్క్ 7 అక్టోబర్, 2026 9:30 AMకి 2,589 వీక్షణలు
విధులకు దూరంగా.. డిమాండ్ల కోసం పోరుబాట — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

అక్టోబరు 6: సమస్యల పరిష్కారం కోరుతూ వైద్య, ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగులు మంగళవారం నుంచి అత్యవసర సేవలు మినహా మిగిలిన విధులను బహిష్కరించారు. ఏపీ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపట్టారు. సీఐటీయూ జిల్లా కమిటీ సంఘీభావం తెలిపింది. జేఏసీ చైర్మన్‌ పులి ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో సుమారు ఐదు వందల మంది కాంట్రాక్టు ఉద్యోగులు విధుల బహిష్కరణలో పాల్గొంటున్నారని, దీనివల్ల వైద్య సేవలపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. దీర్ఘకాలంగా సేవలందిస్తున్న అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, వంద శాతం గ్రాస్‌ వేతనాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. పారామెడికల్‌ కేడర్లలో రెగ్యులర్‌ నియామకాలు చేపట్టాలని కోరారు. స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులతోపాటు డయాలసిస్‌, రేడియాలజీ, ఈసీజీ విభాగాల సిబ్బంది నిరసనలో పాల్గొన్నట్లు జేఏసీ కన్వీనర్‌ కె. బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. అత్యవసర సేవలను కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జీసీఎన్‌ఏ ఉపాధ్యక్షురాలు సౌమ్యరేఖ బోకినాల, జిల్లా జేఏసీ సమన్వయకర్త లోకేష్‌కుమార్‌, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె. వెంకటేశ్వరరావు, కార్యదర్శి బూర సుబ్రమణ్యం, మండల కన్వీనర్‌ సీహెచ్‌. జయరావు, ఏపీ ఎన్జీఓస్‌ జిల్లా అధ్యక్షుడు ఆకూరి శ్రీనివాస్‌రావు, కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086