“తోలు తీస్తా”.. వైసీపీ నేతలకు బొండా ఉమా వార్నింగ్
▪️ ఆధారాలు లేకుండా ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరిక... ▪️ స్పోర్ట్స్ కోటా, మెగా డీఎస్సీ అంశాలపై చర్చకు సిద్ధమన్న బొండా ఉమా... ▪️ అవినాష్, వెలంపల్లి, మల్లాది విష్ణుపై తీవ్ర విమర్శలు...

విజయవాడ: ఆధారాలు లేకుండా ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తే సహించేది లేదని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా హెచ్చరించారు. స్పోర్ట్స్ కోటా, మెగా డీఎస్సీ అంశాలపై అధికారులతో మాట్లాడేందుకు ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమని పేర్కొన్నారు. వైసీపీ నేతలు యువతను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. పద్ధతి మార్చుకోకపోతే తీవ్రంగా స్పందిస్తానంటూ దేవినేని అవినాష్, వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులను ఉద్దేశించి హెచ్చరించారు.

