మూడు రోజులు మూడు చోట్ల ఉద్యోగ మేళాలు
నందిగామ మైలవరం జగ్గయ్యపేటల్లో వరుసగా నిర్వహణ సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు నిరుద్యోగులకు అవకాశం పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన యువత అర్హులు

విజయవాడ, సెప్టెంబర్ 26 : ఎన్టీఆర్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మూడు రోజులపాటు మూడు ప్రాంతాల్లో ఉద్యోగ మేళాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ తెలిపారు. ఈ నెల 28న నందిగామలోని ఏపీ ఎన్జీవోస్ భవనం, ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ జాకీర్ హుస్సేన్ డిగ్రీ కళాశాలలో 29న, జగ్గయ్యపేటలోని ఎస్ఏవీ అండ్ ఎన్వీజేఆర్ డిగ్రీ కళాశాలలో 30న ఉద్యోగ మేళాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటలకు మేళాలు ప్రారంభమవుతాయని తెలిపారు. పదో తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హత కలిగి, 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసున్న యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్, బయోడేటాతో హాజరుకావాలని కోరారు.

