73వ డివిజన్లో సుజాతకు పెరుగుతున్న ప్రజామద్దతు!
ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ అభ్యర్థి ఎరుబోతు సుజాత... కూటమి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లతో మమేకం... సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి...

విజయవాడ సెంట్రల్, అక్టోబర్ 27: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గంలోని 73వ డివిజన్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ఎరుబోతు సుజాత ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి మద్దతు కోరారు. ఓటరు జాబితాలను వెంట తీసుకుని ఇంటింటా పర్యటించిన సుజాత, కూటమి నాయకులు ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పేదలు, మహిళలు, వృద్ధులు, యువత సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. మసీదుల అభివృద్ధి, మౌజన్లకు గౌరవ వేతనం, పేద కుటుంబాలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, వృద్ధులకు నెలకు రూ.4 వేల పింఛను, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ, పేద విద్యార్థుల చదువులకు ఆర్థిక సహాయం, నిరుపేదలకు ఉపాధి కల్పించేందుకు టిఫిన్ బండ్ల పంపిణీ వంటి చర్యలను ప్రస్తావించారు. 73వ డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని అభ్యర్థి ఎరుబోతు సుజాత తెలిపారు. డివిజన్ అభివృద్ధి, సంక్షేమ పథకాల కొనసాగింపు కోసం కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 73వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఎరుబోతు సుజాతకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కూటమి నాయకులు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

