ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ7, ఆగస్టు 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

సాగునీటి కోసం రైతుల పోరుబాట.. గూడూరులో రిలే నిరాహార దీక్ష

రైతులకు అండగా దీక్షలో పాల్గొన్న ఉప్పాల రాము, ఉప్పాల హారిక. నీరు విడుదల చేయకపోతే మహా పాదయాత్ర, ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరిక. సాగునీటిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని రైతుల డిమాండ్.

V10TV న్యూస్ డెస్క్ 7 ఆగస్టు, 2026 10:19 AMకి 258 వీక్షణలు
సాగునీటి కోసం రైతుల పోరుబాట.. గూడూరులో రిలే నిరాహార దీక్ష — చిత్రం 1
సాగునీటి కోసం రైతుల పోరుబాట.. గూడూరులో రిలే నిరాహార దీక్ష — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

గూడూరు (కృష్ణాజిల్లా), ఆగస్టు 6: రైతులకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గూడూరు మెయిన్ సెంటర్‌లో రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు పెడన నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఉప్పాల రాము, కృష్ణాజిల్లా జడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక మద్దతు తెలిపారు. రైతులతో కలిసి దీక్షలో పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఉప్పాల రాము మాట్లాడుతూ, ఏరువాక సందర్భంగా రైతులను సాగుకు ప్రోత్సహించిన ప్రభుత్వం, అనంతరం సాగునీటికి నీరు లేదని ప్రకటించడం రైతులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందని ఆరోపించారు. సాగునీటి అంశంపై ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్య

సాగునీటి కోసం రైతుల పోరుబాట.. గూడూరులో రిలే నిరాహార దీక్ష — అదనపు చిత్రం 2

పరిష్కారం కాకపోతే గూడూరు తర్వాత పెడన, బంటుమిల్లి, కృతివెన్నులో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆగస్టు 10న పెడనలో భారీ ర్యాలీ చేపడతామని, అయినా స్పందన లేకుంటే పల్లిపాలెం నుంచి గుడ్లవల్లేరు వరకు మహా పాదయాత్ర ప్రారంభిస్తామని హెచ్చరించారు. అవసరమైతే ప్రకాశం బ్యారేజ్ వరకు పాదయాత్ర కొనసాగించి, చివరి దశలో ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ రైతుల తరఫున ముఖ్యమంత్రితో మాట్లాడి పెడన నియోజకవర్గానికి వెంటనే సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఉప్పాల రాము కోరారు. కార్యక్రమంలో రైతులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

అంధులకు ఆశాకిరణం.. 'బ్లైండ్‌సైట్'తో కొత్త చూపు!

5 నిమిషాల క్రితం 121

‘నేతన్న సేవలో’తో చేనేత కుటుంబాలకు చేయూత

1 గంట క్రితం 452

రాయవరం నుంచి టీడీపీ డోర్ టు డోర్ ప్రచారానికి శ్రీకారం

1 గంట క్రితం 149

సహాయం పేరుతో ఇంటికొచ్చి.. తాళాలు పగులగొట్టి రూ.లక్షల బంగారం చోరీ

1 గంట క్రితం 785