ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

మోదీ పేరిట దుర్గమ్మకు ఖడ్గమాల అర్చన

పాలనా ప్రస్థానానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక పూజలు… పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో నిర్వహించిన లింగమనేని రమేశ్‌… ప్రధాని కార్యాలయానికి అమ్మవారి ప్రసాదం, చిత్రపటం, శేషవస్త్రాలు…

V10TV న్యూస్ డెస్క్ 7 అక్టోబర్, 2026 10:58 AMకి 3,219 వీక్షణలు
మోదీ పేరిట దుర్గమ్మకు ఖడ్గమాల అర్చన — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 7: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనా ప్రస్థానానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో బుధవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆదేశాల మేరకు రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్‌ ఆధ్వర్యంలో మోదీ పేరిట ఖడ్గమాల అర్చన చేయించారు. ప్రధానికి ఆయురారోగ్యాలు, దేశాన్ని వికసిత్‌ భారత్‌ వైపు నడిపించేందుకు మరింత శక్తిసామర్థ్యాలు కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా రమేశ్‌ మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. మహిళలు, రైతులు, యువతతోపాటు అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌పై ప్రధాని ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, అమరావతి, పోలవరం పనులు వేగంగా సాగుతున్నాయని రమేశ్‌ తెలిపారు. రైల్వే, జాతీయ రహదారులు తదితర మౌలిక వసతుల అభివృద్ధిలో రాష్ట్రానికి ప్రాధాన్యత లభిస్తోందన్నారు. దేశం మరింత బలమైన, సుసంపన్నమైన, స్వావలంబన కలిగిన దేశంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఖడ్గమాల అర్చన ప్రసాదం, అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ చిల్లపల్లి శ్రీనివాస్‌, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, ఠాకూర్‌ అజయ్‌వర్మ, ఆలయ పాలకమండలి సభ్యులు ఎం. రామబ్రహ్మం, పద్మావతి ఠాకూర్‌ పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

48 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

55 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086