నెల తొలిరోజే ఇంటి వద్ద పింఛన్ భరోసా
పటమట రెల్లి కాలనీలో లబ్ధిదారులకు పంపిణీ… ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్… ప్రజల వద్దకే పాలన కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి…

విజయవాడ, అక్టోబరు 1: విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పటమట రెల్లి కాలనీలో గురువారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూటమి నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నెల మొదటి రోజే ఉదయం 6 గంటల నుంచి లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజలకు చేరవేయడంతోపాటు ప్రజల వద్దకే పాలన అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

