ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

బుడమేరుపై భయం వద్దు

వదంతులు నమ్మొద్దు ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది 10 వేల క్యూసెక్కుల వరద నీరు కృష్ణానదిలోకి మళ్లింపు ముందస్తు చర్యలు చేపట్టామన్న ఎమ్మెల్యే బొండా ఉమా

V10TV న్యూస్ డెస్క్ 25 సెప్టెంబర్, 2026 10:07 AMకి 2,333 వీక్షణలు
బుడమేరుపై భయం వద్దు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్ 24: బుడమేరు పరివాహక ప్రాంతాల ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు సుమారు 10 వేల క్యూసెక్కుల వరద నీటిని కృష్ణానదిలోకి మళ్లించినట్లు వెల్లడించారు. మరింత వరద వచ్చినా సురక్షితంగా మళ్లించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పారు. 2024 వరద ముంపు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో వ్యవహరిస్తోందన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీటిని మోటార్లతో తొలగిస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్‌తోపాటు సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, ఇతర శాఖల సిబ్బందితో నిరంతరం సమీక్షిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామన్నారు. పాయకాపురం, సింగ్‌నగర్, ప్రకాష్‌నగర్, సుందరయ్యనగర్, వడ్ల కాలనీ, రాజీవ్‌నగర్, కండ్రిక ప్రాంతాల ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు కాల్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని బొండా ఉమా స్పష్టం చేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086