ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

షాదీఖానా అభివృద్ధికి మరో రూ.20 లక్షలు

19వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గద్దె శంకుస్థాపన… రూ.1.20 కోట్లతో పూర్తిస్థాయిలో సౌకర్యాల కల్పనకు చర్యలు… రంజాన్ నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు కృషి…

V10TV న్యూస్ డెస్క్ 9 అక్టోబర్, 2026 4:33 PMకి 3,259 వీక్షణలు
షాదీఖానా అభివృద్ధికి మరో రూ.20 లక్షలు — చిత్రం 1
షాదీఖానా అభివృద్ధికి మరో రూ.20 లక్షలు — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 9: ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. శుక్రవారం 19వ డివిజన్ లబ్బీపేటలోని షాదీఖానాలో రూ.20 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లిం పేద కుటుంబాల వివాహాది శుభకార్యాలకు షాదీఖానా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గతంలో ఆర్‌అండ్‌బీ మంత్రిగా పనిచేసిన అయ్యన్నపాత్రుడు సహకారంతో స్థలం కేటాయించినట్లు గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో రూ.35 లక్షలతో పనులు జరగగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.65 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. తాజాగా మరో రూ.20 లక్షలతో మరుగుదొడ్లు,

షాదీఖానా అభివృద్ధికి మరో రూ.20 లక్షలు — అదనపు చిత్రం 2

ప్రహరీ గోడ, రెయిలింగ్‌లు, ఇతర పెండింగ్ పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. షాదీఖానాలో ఏసీల ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు. టీడీపీ మైనార్టీ విభాగం నాయకుడు ఫిరోజ్ మాట్లాడుతూ ముస్లిం సోదరులకుఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పేద కుటుంబాలకు తక్కువ ఖర్చుతో వివాహాలు నిర్వహించుకునే అవకాశం కలుగుతుందన్నారు. భాగం సాయిప్రసాద్ మాట్లాడుతూ రంజాన్ మాసంలోపు పెండింగ్ పనులు పూర్తి చేసి షాదీఖానాను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ముమ్మనేని ప్రసాద్, ఎండీ ఖలీల్, ఎస్‌కే సిరాజ్, ఎండీ హుస్సేన్, దున్న ఏసురత్నం, తోట యుగంధర్, షఫీ, గద్దె రమేష్, కార్పొరేషన్ ఈఈ రామారావు తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086