ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

సరస్‌ మేళా.. మహిళల వ్యాపార కళ!

ఇప్పటివరకు సుమారు రూ.౨ కోట్ల విక్రయాలు… ౩౨ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ౧,౫౦౦ మంది మహిళల భాగస్వామ్యం… ౬౦౦ స్టాళ్లు.. ౫౦ ప్రత్యక్ష వంటకాల కేంద్రాలతో సందడి…

V10TV న్యూస్ డెస్క్ 17 అక్టోబర్, 2026 7:58 PMకి 4,101 వీక్షణలు
సరస్‌ మేళా.. మహిళల వ్యాపార కళ! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ ౧౭: గ్రామీణ మహిళల ప్రతిభకు పట్టం కడుతూ.. వారి ఉత్పత్తులకు జాతీయ స్థాయి మార్కెట్‌ కల్పిస్తూ విజయవాడ పున్నమి ఘాట్‌లో నిర్వహిస్తున్న జాతీయ సరస్‌ మేళా సందర్శకులను ఆకట్టుకుంటోంది. చేనేత వస్త్రాలు, హస్తకళలు, సహజ ఆహార ఉత్పత్తులు, ప్రాంతీయ వంటకాలతో వివిధ రాష్ట్రాల సంస్కృతులను ఒకేచోట పరిచయం చేస్తోంది. దేశవ్యాప్తంగా ౩౨ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సుమారు ౧,౫౦౦ మంది మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్న ఈ మేళాలో ఇప్పటివరకు సుమారు రూ.౨ కోట్ల వ్యాపారం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పున్నమి ఘాట్‌లోని సరస్‌ ప్రదర్శన ప్రాంగణంలో శనివారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఎన్‌ఐఆర్‌డీ అదనపు సంచాలకులు సుధీర్‌కుమార్‌ మాట్లాడారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెర్ప్‌ సహకారంతో నిర్వహిస్తున్న మేళా ప్రధాన ఉద్దేశం స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించడమేనన్నారు. చేనేత, హస్తకళలు, ఆహార ఉత్పత్తులతో సుమారు ౬౦౦ స్టాళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. వివిధ రాష్ట్రాల సంప్రదాయ వంటకాలను రుచి చూసేందుకు ౫౦ ప్రత్యక్ష వంటకాల స్టాళ్లతో ప్రత్యేక ఆహార ప్రాంగణాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. రోజుకు సుమారు ౪౦ వేల నుంచి ౫౦ వేల మంది సందర్శకులు వస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలు తమ ఉత్పత్తులను నాణ్యమైన బ్రాండ్లుగా అభివృద్ధి చేసుకునేందుకు నిపుణులతో ప్రతిరోజూ శిక్షణ ఇస్తున్నట్లు సుధీర్‌కుమార్‌ వివరించారు. బ్రాండింగ్‌, ప్యాకేజింగ్‌, ఎగుమతి మార్కెటింగ్‌, ఉత్పత్తి నుంచి విక్రయం వరకు వ్యాపార నిర్వహణ అంశాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల విజయగాథలను పరిచయం చేసే ‘లఖ్‌పతి దీదీ’ ప్రదర్శన విభాగం, ఉత్పత్తుల తయారీని ప్రత్యక్షంగా చూపించే ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని తెలిపారు. సందర్శకుల సౌకర్యార్థం రెండో ప్రవేశద్వారం వద్ద సహాయ కేంద్రం, నమోదు కౌంటర్‌, పోయిన వస్తువులను గుర్తించేందుకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ పథకాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉన్న అవకాశాలను వివరించేందుకు ప్రత్యేక ప్రదర్శన విభాగాన్ని అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. సెర్ప్‌ పరిపాలనా సంచాలకులు కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ.. మహిళా సంఘాలకు స్టాళ్లను ఉచితంగా కేటాయించడంతోపాటు ప్రయాణం, భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మహిళలు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు, వ్యాపార సంబంధాలను విస్తరించుకునేందుకు మేళా ఉపయోగపడుతోందన్నారు. విభిన్న రాష్ట్రాల కళలు, వస్త్రాలు, వంటకాలతో ప్రాంగణం ‘మినీ ఇండియా’ను తలపిస్తోందని పేర్కొన్నారు. గ్రామీణ మహిళల ఆదాయాన్ని పెంచేందుకు ఇటువంటి వేదికలు దోహదపడతాయన్నారు. సమావేశంలో జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ సంయుక్త సంచాలకులు ఖటారియా, ఎన్టీఆర్‌ జిల్లా ప్రాజెక్టు సంచాలకులు ఏఎన్‌వీ నాంచారరావు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

3 నిమిషాల క్రితం 4,897

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

14 గంటల క్రితం 4,086

నామినేషన్లకూ ముందుకు రాని వైసీపీ: మంత్రి

14 గంటల క్రితం 2,256

వేదాలే మన సంస్కృతికి మూలస్తంభాలు

15 గంటల క్రితం 4,089