ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

పుష్పశోభతో వెలిగిపోతున్న ఇంద్రకీలాద్రి!

శరన్నవరాత్రి వేళ రంగురంగుల పూలతో దుర్గమ్మ సన్నిధికి కొత్త శోభ… ఆలయ ముఖద్వారం నుంచి అమ్మవారి సన్నిధి వరకు ప్రత్యేక పుష్పాలంకరణలు… కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ దంపతులు…

V10TV న్యూస్ డెస్క్ 11 అక్టోబర్, 2026 12:31 PMకి 4,791 వీక్షణలు
పుష్పశోభతో వెలిగిపోతున్న ఇంద్రకీలాద్రి! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 11: శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి పుష్పశోభతో విరాజిల్లుతోంది. కొండపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయాన్ని వివిధ రకాల రంగురంగుల పుష్పాలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. పసుపు, నారింజ రంగుల బంతిపూల మాలలు, పచ్చని ఆకులతో రూపొందించిన తోరణాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఆలయ ముఖద్వారం నుంచి అంతర్గత ప్రాంగణం వరకు సంప్రదాయ పుష్పాలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎరుపు, తెలుపు, పసుపు, గులాబీ, ఊదా రంగుల పూలతో అలంకరించిన అమ్మవారి సన్నిధి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ దంపతులు ఆదివారంఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన పుష్పాలంకరణలు, ఉత్సవ ఏర్పాట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరోవైపు దసరా ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. కలెక్టర్ లక్ష్మీశ పర్యవేక్షణలో దేవస్థానం, పోలీసు, నగరపాలక సంస్థ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ ఆధ్వర్యంలో దర్శన మార్గాల క్రమబద్ధీకరణ, ఆలయ పరిసరాల నిర్వహణ, భక్తుల రాకపోకలపై ప్రత్యేక దృష్టి సారించారు. భక్తుల రాకతో ఇంద్రకీలాద్రిపై పండుగ వాతావరణం నెలకొంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

48 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

55 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086