ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

గుడివాడలో పార్కుల అభివృద్ధికి రూ.1.97 కోట్లు

రాజేంద్రనగర్‌లో రూ.80 లక్షలతో పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన... వాసవి చౌక్‌లో రూ.1.17 కోట్లతో ఆధునికీకరించిన పార్కు ప్రారంభం... చిన్నారులకు ఆటవిడుపు.. పెద్దలకు ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

V10TV న్యూస్ డెస్క్ 11 అక్టోబర్, 2026 8:07 PMకి 2,966 వీక్షణలు
గుడివాడలో పార్కుల అభివృద్ధికి రూ.1.97 కోట్లు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

గుడివాడ, అక్టోబర్‌ 11: పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడంతో పాటు చిన్నారులకు ఆటవిడుపు, పెద్దలకు ఆరోగ్య పరిరక్షణ కల్పించడమే లక్ష్యంగా మున్సిపల్‌ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. ఆదివారం రాజేంద్రనగర్‌లోని రావి శోభనాద్రి చౌదరి మున్సిపల్‌ పార్కులో రూ.80 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు స్థానికులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వాసవి చౌక్‌ వద్ద రూ.1.17 కోట్లతో ఆధునికీకరించిన తుమ్మల రామబ్రహ్మం మున్సిపల్‌ పార్కును ప్రారంభించారు. రామబ్రహ్మం కుటుంబ సభ్యురాలు తుమ్మల పంకజవల్లి ఎమ్మెల్యేతో కలిసి రిబ్బన్‌ కట్‌ చేయగా, కూటమి నాయకులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మున్సిపల్‌ కమిషనర్‌ సింహాద్రి మనోహర్‌తో కలిసి పార్కులో కలియతిరిగిన ఎమ్మెల్యే అక్కడ ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాల్లో పార్కులు కేవలం వినోద కేంద్రాలే కాకుండా ప్రజల ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు, సామాజిక అనుబంధాలకు ఉపయోగపడే వేదికలని పేర్కొన్నారు. చిన్నారులు స్వేచ్ఛగా ఆడుకునేందుకు, యువత వ్యాయామం చేసేందుకు, వృద్ధులు ప్రశాంతంగా సేదతీరేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నామన్నారు. పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు మౌలిక సదుపాయాలను మెరుగుపరచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పార్కులను పరిశుభ్రంగా ఉంచడం ప్రజల బాధ్యత కూడా అని, ఆట వస్తువులు, వ్యాయామ పరికరాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. పార్కు అభివృద్ధిపై తుమ్మల పంకజవల్లి, శాంతి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పంకజవల్లిని ఎమ్మెల్యే, కూటమి నాయకులు సత్కరించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్‌ స్టేడియం కమిటీ వైస్‌ చైర్మన్‌ యలవర్తి శ్రీనివాసరావు, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ చాట్రగడ్డ రవికుమార్‌, జనసేన ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్‌, పట్టణ టీడీపీ అధ్యక్షుడు పండ్రాజు సాంబశివరావు, మున్సిపల్‌ అధికారులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086