నున్న పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్గా మహమ్మద్ ఉమర్
నున్న పోలీస్‌స్టేషన్‌లో కీలక పోస్టింగ్… అహ్మద్ అలీ ఆకస్మిక మృతితో ఖాళీ అయిన స్థానం… త్వరలో బాధ్యతలు చేపట్టనున్న మహమ్మద్ ఉమర్…

విజయవాడ, అక్టోబర్ 2: నున్న పోలీస్‌స్టేషన్ నూతన ఇన్స్పెక్టర్గా మహమ్మద్ ఉమర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల నున్న పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఎస్కే అహ్మద్ అలీ ఆకస్మికంగా మృతి చెందడంతో ఖాళీ అయిన స్థానంలో మహమ్మద్ ఉమర్‌ను నియమించారు. ఆయన త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంపై దృష్టి సారించనున్నారు.

