వినాయక మండపాల అనుమతులకు ప్రత్యేక ఈ–పోర్టల్
వినాయక మండపాల అనుమతులకు ప్రత్యేక ఈ–పోర్టల్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా సింగిల్ విండోలో అనుమతులు నిర్వాహకులు www.ganeshutsav.net� ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

అమరావతి: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మండపాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను సులభంగా పొందేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసుశాఖ ప్రత్యేక ఈ–పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నిర్వాహకులు www.ganeshutsav.net� పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. వివిధ ప్రభుత్వ శాఖల అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సింగిల్ విండో విధానంలో ఈ పోర్టల్‌ను రూపొందించినట్లు పేర్కొంది. మండప నిర్వాహకులకు సమయం ఆదా చేయడంతోపాటు అనుమతుల ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా పూర్తిచేయడం దీని ప్రధాన ఉద్దేశమని వెల్లడించింది. వినాయక ఉత్సవాల ఏర్పాట్లు, మండపాల అనుమతుల ప్రక్రియకు సంబంధించిన వివరాలతో డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. నిర్వాహకులు ముందుగానే దరఖాస్తు చేసుకొని, పోలీసుశాఖ సూచించే భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

