విజయదశమి వేళ ఇంద్రకీలాద్రికి భక్తజనం పోటెత్తింది!
ఇప్పటివరకు లక్ష మంది భక్తులకు అమ్మవారి దర్శనం… శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ… భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి క్యూలైన్లు…

విజయవాడ, అక్టోబర్ 20: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఇప్పటివరకు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు సమాచారం. భక్తుల రాక కొనసాగుతుండటంతో దర్శనాల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

