ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

స్థానిక సంస్థల ఎన్నికలకు మరో రెండు నెలలు పట్టే అవకాశం

ఓటర్ల జాబితా, రిజర్వేషన్లపై ఇంకా రాని స్పష్టత... న్యాయస్థానాల్లోని కేసులపైనా ఎన్నికల సంఘం దృష్టి... ఎన్నికల నిర్వహణకు అంతర్గతంగా కొనసాగుతున్న ఏర్పాట్లు...

V10TV న్యూస్ డెస్క్ 29 సెప్టెంబర్, 2026 10:03 AMకి 3,260 వీక్షణలు
స్థానిక సంస్థల ఎన్నికలకు మరో రెండు నెలలు పట్టే అవకాశం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

అమరావతి, సెప్టెంబర్ 29: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేందుకు మరో రెండు నెలల సమయం పట్టవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా వెల్లడించారు. ఓటర్ల జాబితాల ఖరారు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల నిర్ధారణతోపాటు న్యాయస్థానాల్లో కొనసాగుతున్న కేసులపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఈ కీలక అంశాలు పరిష్కారమైన తర్వాతే ఎన్నికల నిర్వహణపై ముందడుగు వేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల ఆలస్యమైనప్పటికీ నిర్వహణకు అవసరమైన అంతర్గత ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రారంభించింది. ఓటర్ల జాబితాల పరిశీలన, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సిబ్బంది, సామగ్రి సమీకరణకు సంబంధించిన ప్రాథమిక కసరత్తు కొనసాగుతోంది. న్యాయపరమైన, పరిపాలనాపరమైన అడ్డంకులు తొలగిన వెంటనే ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకొని షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

58 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086