78వ డివిజన్‌లో బొండా ఉమా ఇంటింటి ప్రచారం
ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగిన ఎమ్మెల్యే… డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు… ఈ నెల 28న జరిగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపు…

విజయవాడ, అక్టోబర్ 14: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 78వ డివిజన్‌లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అజిత్‌సింగ్‌నగర్‌లోని మదీనా మసీదు వద్ద నుంచి సెంట్రల్ నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ గౌస్ బాషా ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం చేపట్టారు. స్థానికులతో మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడమే ప్రజాప్రతినిధుల ప్రధాన బాధ్యత అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గత 26 నెలలుగా కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రచారంలో భాగంగా స్థానికులు డ్రైనేజీ, కాలువలు, పారిశుద్ధ్య సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య పనులపై శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు సూచనలు చేయడంతో పాటు దెబ్బతిన్న డ్రైనేజీ మరమ్మతులను చేపట్టాలని ఏఈ సతీష్‌ను ఆదేశించారు. పేదలు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు. పెన్షన్ల పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి పథకాలతో ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గురువారం నుంచి ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 28న జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో షేక్ మెహరుద్దీన్, షేక్ రహీం, పిరియా సోమేశ్వరరావు, పిరియా జగదంబ, షేక్ షబ్బీర్, షేక్ ఖాజా, బడే బాజీ, షేక్ జానీ బాషా, షేక్ సుబానీ, షేక్ నాగుల్ మీరా, షేక్ గౌసియా, షేక్ జాన్‌వలి, అమర్‌నాథ్ గౌడ్, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఫొటో రైటప్: విజయవాడ 78వ డివిజన్ అజిత్‌సింగ్‌నగర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.

