నాగబాబు కాదు.. చైర్మన్ ‘కొణిదెల నాగేంద్రరావు’!
ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన కొణిదెల నాగేంద్రరావు... అధికారిక వ్యవహారాల్లో తన అసలు పేరునే ఉపయోగించాలని నిర్ణయం... సినిమాల్లోకి వచ్చాకే ‘నాగబాబు’ పేరు.. ఇకపై నాగేంద్ర రావుగానే కొనసాగనున్న జనసేన నేత...

విజయవాడ, ఆగస్టు 28: సినీ, రాజకీయ రంగాల్లో **‘నాగబాబు’**గా సుపరిచితమైన జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావు ఇకపై అధికారిక వ్యవహారాల్లో తన అసలు పేరైన **‘నాగేంద్ర రావు’**ను ఉపయోగించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆయనను Andhra Pradesh Society for Greening and Reforestation for Ecological Enrichment (AP GREEN) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా కేబినెట్ హోదాతో నియమించింది. ఆగస్టు 17న పర్యావరణ, అటవీ శాఖ దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఏర్పాటు చేసిన నేమ్‌బోర్డుపై కూడా “Sri Konidela Nagendra Rao – Chairman” అని పేర్కొన్నారు. ‘నాగబాబు’ అనేది సినీ రంగంలోకి వచ్చిన తర్వాత ప్రాచుర్యంలోకి వచ్చిన పేరని, అధికారిక వ్యవహారాల్లో అసలు పేరునే కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు పేర్కొంటున్నాయి.
AP GREEN ద్వారా రాష్ట్రంలో అటవీ, పచ్చదనం కలిపి 2047 నాటికి 50 శాతానికి పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. వివిధ శాఖలు, జిల్లా స్థాయి సంస్థల మధ్య సమన్వయం చేస్తూ కార్యక్రమాల అమలును వేగవంతం చేయడం చైర్మన్ బాధ్యతల్లో భాగం.

