సత్యనారాయణపురం నూతన ఎస్సైగా షబ్నం
పటమట, గవర్నర్‌పేట పోలీస్స్టేషన్లలో గతంలో విధులు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తానని వెల్లడి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని స్పష్టీకరణ

విజయవాడ, సెప్టెంబర్ 26 : సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్ నూతన ఎస్సైగా షేక్ షబ్నం శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె పటమట, గవర్నర్‌పేట పోలీస్స్టేషన్లలో ఎస్సైగా విధులు నిర్వహించారు. స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. నేరాల నియంత్రణతోపాటు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, బాధితులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఎస్సై షబ్నం పేర్కొన్నారు.

