ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

దెబ్బతిన్న రహదారులకు తక్షణ మరమ్మతులు

పంచాయతీ కార్యదర్శులతో ఎమ్మెల్యే యార్లగడ్డ అత్యవసర సమీక్ష ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా క్షేత్రస్థాయిలోనే ఉండాలని ఆదేశం నీరు నిలిచిన ప్రాంతాలు, దెబ్బతిన్న రహదారులపై తక్షణ చర్యలకు సూచన

V10TV న్యూస్ డెస్క్ 24 సెప్టెంబర్, 2026 1:15 PMకి 3,651 వీక్షణలు
దెబ్బతిన్న రహదారులకు తక్షణ మరమ్మతులు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

గన్నవరం, సెప్టెంబర్‌ 24: తుఫాను ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గన్నవరం నియోజకవర్గంలో ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదేశించారు. గురువారం పంచాయతీ కార్యదర్శులతో దృశ్యమాధ్యమం ద్వారా అత్యవసర సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉన్నందున పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉండాలని సూచించారు. నీరు నిలిచిన ప్రాంతాలు, దెబ్బతిన్న రహదారులు, మురుగునీటి పారుదల సమస్యలపై ప్రత్యేక దృష్టిసారించి ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల భద్రతకే తొలి ప్రాధాన్యమిస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. పంచాయతీ కార్యదర్శుల వాట్సప్‌ బృందం ద్వారా నియోజకవర్గంలోని వర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు యార్లగడ్డ తెలిపారు. అధికారులు అందిస్తున్న సమాచారాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. భారీ వర్షాల్లోనూ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అభినందించారు. వర్షాల ప్రభావం తగ్గేవరకు ఇదే సేవాస్ఫూర్తితో ప్రజలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086