ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

బెజవాడ కీర్తిని చాటేలా విజయవాడ ఉత్సవ్‌

మైసూరు దసరా, కోల్‌కతా దుర్గాపూజ తరహాలో వేడుకలు… పున్నమి ఘాట్‌ వద్ద ప్రారంభమైన ఏర్పాట్లు… పది రోజుల ఉత్సవంలో ప్రజలంతా భాగస్వాములు కావాలి: బుద్ధా వెంకన్న…

V10TV న్యూస్ డెస్క్ 6 అక్టోబర్, 2026 1:58 PMకి 2,127 వీక్షణలు
బెజవాడ కీర్తిని చాటేలా విజయవాడ ఉత్సవ్‌ — చిత్రం 1
బెజవాడ కీర్తిని చాటేలా విజయవాడ ఉత్సవ్‌ — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబరు 6: విజయవాడ నగర కీర్తిని దేశవ్యాప్తంగా చాటిచెప్పేలా విజయవాడ ఉత్సవ్‌ను నిర్వహించనున్నట్లు పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న తెలిపారు. పున్నమి ఘాట్‌ వద్ద ఉత్సవ ఏర్పాట్లకు సంబంధించిన పనులు ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) నేతృత్వంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఈ వేడుకల్లో ప్రజలందరూ కుటుంబ సమేతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. పున్నమి ఘాట్‌ పరిసరాలను ప్రధాన వేదికగా చేసుకుని పది రోజులపాటు సాంస్కృతిక, కళా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెంకన్న చెప్పారు. మైసూరు దసరా, కోల్‌కతా దుర్గాపూజ తరహాలో విజయవాడ ఉత్సవ్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళారూపాలు ప్రత్యేక

బెజవాడ కీర్తిని చాటేలా విజయవాడ ఉత్సవ్‌ — అదనపు చిత్రం 2

ఆకర్షణగా నిలవనున్నాయన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌తోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులను ఆహ్వానించినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భారత రాష్ట్రపతి కూడా హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపినట్లు పేర్కొన్నారు. కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులతోపాటు ప్రజలు ఉత్సవంలో పాల్గొని నగర వైభవాన్ని దశదిశలా చాటాలని కోరారు. ‘‘విజయవాడ ఉత్సవ్‌.. విజయవాడ ప్రజల ఉత్సవం’’ అని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో గన్నె నారాయణ ప్రసాద్‌, గొట్టుముక్కల రఘురాం రాజు, మాదిగని గురునాథం, ఎండీ ఫతావుల్లా, పి. చిన్న సుబ్బయ్య గుర్రంకొండ, ఎస్‌కే ఆశ, బడుగు గణేశ్‌, డివిజన్‌ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

43 నిమిషాల క్రితం 3,489

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

50 నిమిషాల క్రితం 3,782

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

57 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086