ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

కార్మిక లోకానికి పల్లా సూర్యారావు సేవలు చిరస్మరణీయం

కార్మికుల సమస్యల పరిష్కారానికి తుది శ్వాస వరకు పోరాడిన నేత… పలు కార్మిక సంఘాలకు పెద్దదిక్కుగా నిలిచిన సూర్యారావు… ఆయన ఆశయ సాధనే నిజమైన నివాళి: సీపీఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు…

V10TV న్యూస్ డెస్క్ 4 అక్టోబర్, 2026 6:09 PMకి 2,591 వీక్షణలు
కార్మిక లోకానికి పల్లా సూర్యారావు సేవలు చిరస్మరణీయం — చిత్రం 1
కార్మిక లోకానికి పల్లా సూర్యారావు సేవలు చిరస్మరణీయం — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 4: కార్మికోద్యమ బలోపేతానికి, కార్మికుల సంక్షేమానికి జీవితాంతం కృషి చేసిన పల్లా సూర్యారావు ఆదర్శప్రాయుడని సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు కొనియాడారు. విజయవాడ బుక్‌ బైండింగ్‌ లేబర్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో వన్‌టౌన్‌లోని లెనిన్‌ భవన్‌లో పల్లా సూర్యారావు సంతాప సభ నిర్వహించారు. యూనియన్‌ కార్యదర్శి బళ్ల నరసింహరాజు అధ్యక్షతన జరిగిన సభలో సూర్యారావు చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ యువజన ఉద్యమాల్లో చురుగ్గా పనిచేసిన సూర్యారావు కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ప్రజా ఉద్యమాల బాట పట్టారని తెలిపారు. సమాజంలో మార్పు కమ్యూనిస్టు ఉద్యమాలతోనే సాధ్యమని, ప్రజా పోరాటాల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన బలంగా విశ్వసించేవారని పేర్కొన్నారు. యువజన నాయకుడిగా, భవన నిర్మాణ కార్మికుల నేతగా పనిచేయడంతోపాటు నగరంలోని అనేక కార్మిక సంఘాలకు సూర్యారావు పెద్దదిక్కుగా నిలిచారని

కార్మిక లోకానికి పల్లా సూర్యారావు సేవలు చిరస్మరణీయం — అదనపు చిత్రం 2

చెప్పారు. కార్మికులకు ఏ సమస్య ఎదురైనా పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమించి విజయవాడ కార్మికోద్యమానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు. సీపీఐ నగర కార్యదర్శిగా విశేష సేవలందించి, అనేక మందిని పార్టీ సిద్ధాంతాల వైపు నడిపించారని తెలిపారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో సూర్యారావు ఎప్పుడూ ముందుండేవారని, చివరి శ్వాస వరకు పీడితులు, కార్మిక వర్గాలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. నగరాభివృద్ధితోపాటు కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ కీలకంగా వ్యవహరించారని చెప్పారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయడమే నిజమైన నివాళని కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర కార్యదర్శి మూలి సాంబశివరావు, సీపీఐ నగర కార్యదర్శివర్గ సభ్యులు తాడి పైడయ్య, కొట్టు రమణరావు, టీడీపీ నాయకుడు, మాజీ కార్పొరేటర్‌ ఉమ్మడి చంటి, బుక్‌ బైండింగ్‌ లేబర్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఆర్‌.సురేష్‌, ఎన్‌.వెంకటరావు, ఎ.సాంబశివరావు తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086