వన్ ట్రాఫిక్ ఏసీపీగా పల్లపు రాజు బాధ్యతల స్వీకరణ
సాధారణ బదిలీల్లో మంగళగిరి ప్రధాన కార్యాలయం నుంచి విజయవాడకు… బాధ్యతలు చేపట్టిన అనంతరం నగర పోలీస్ కమిషనర్‌తో భేటీ… మొక్కను అందించి మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఏసీపీ…

విజయవాడ, సెప్టెంబర్ 2: ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వన్ ట్రాఫిక్ ఏసీపీగా పల్లపు రాజు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న పల్లపు రాజును విజయవాడ వన్ ట్రాఫిక్ ఏసీపీగా బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పల్లపు రాజు నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబును కమిషనర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్‌కు మొక్కను అందించారు. ట్రాఫిక్ నియంత్రణ, రహదారి భద్రత, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని నూతన ఏసీపీకి పోలీస్ కమిషనర్ సూచించారు.

