ఉచిత కంటి పరీక్షలకు విశేష స్పందన
వీర్నాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఈ నెల 17న ఉచితంగా కళ్లజోళ్ల పంపిణీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వీర్నాల బాలాజీ వెల్లడి


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
మచిలీపట్నం, జూన్ 12 (వీ10 టీవీ): గూడూరు మండలం కొకనారాయణపాలెం గ్రామంలో వీర్నాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వీర్నాల బాలాజీ పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరంలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో కంటి

సమస్యలను గుర్తించిన వారికి ఈ నెల 17న ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేయనున్నట్లు వీర్నాల బాలాజీ తెలిపారు. ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫోటో రైట్‌అప్: కొకనారాయణపాలెంలో గ్రామస్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది.

