ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

కాంగ్రెస్‌ నేతల అరెస్టులకు నిరసనగా ధర్నా

కేంద్ర ప్రభుత్వ తీరుపై విజయవాడ నగర కాంగ్రెస్‌ ఆగ్రహం… ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తామన్న నరసింహారావు… ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్‌…

V10TV న్యూస్ డెస్క్ 8 అక్టోబర్, 2026 6:58 PMకి 3,525 వీక్షణలు
కాంగ్రెస్‌ నేతల అరెస్టులకు నిరసనగా ధర్నా — చిత్రం 1
కాంగ్రెస్‌ నేతల అరెస్టులకు నిరసనగా ధర్నా — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 8: కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ విజయవాడ నగర కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గురువారం ధర్నా చౌక్‌లో నిరసన నిర్వహించారు. నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అనుసరిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్న కాంగ్రెస్‌ నేతలను అరెస్టులతో అడ్డుకోవాలని చూస్తోందన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజల

కాంగ్రెస్‌ నేతల అరెస్టులకు నిరసనగా ధర్నా — అదనపు చిత్రం 2

హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల అధికారుల పనితీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం కలిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏపీసీసీ ఉపాధ్యక్షుడు వి. గురునాథం, పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి అన్సారి, విద్యార్థి విభాగం రాష్ట్ర సమన్వయకర్త వేముల శ్రీనివాస్‌, నగర వర్తక వ్యాపార విభాగం చైర్మన్‌ గణేష్‌, సేవాదళ్‌ నగర చైర్మన్‌ సూరిబాబు, కాపు విభాగం జిల్లా అధ్యక్షుడు రాజేష్‌, నగర నాయకులు సత్యవతి, వలి తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086