ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గం: సీపీఎం
విజయవాడలో సీపీఎం రాష్ట్ర నాయకులతో ప్రభుత్వ ఉద్యోగుల సమావేశం... ఉద్యోగుల డిమాండ్ల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపు... ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కార్యాచరణకు సిద్ధమైన ఉద్యోగ సంఘాలు...

విజయవాడ, ఆగస్టు 6 (వి10 టీవీ): విజయవాడలో సీపీఎం రాష్ట్ర నాయకులతో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు కలిసి ఐక్యంగా ఉద్యమిస్తేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

