వారంలోగా వారందరికీ రూ.25 వేలు!
‘స్వర్ణ’ పథకంలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి మంత్రి సవిత ఆదేశం... ఇంటి ఓనర్ అనుమతి లేకుండానే పథకం వర్తింపజేయాలని సూచన.. 13,678 దరఖాస్తులు పెండింగ్.. అర్హులకు వారంలోగా సాయం అందించే అవకాశం...

అమరావతి: ‘నేతన్నకు స్వర్ణం’ పథకంలో భాగంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలని అధికారులను మంత్రి సవిత ఆదేశించారు. అద్దె ఇళ్లలో ఉంటున్న వారికి ఇంటి యజమాని అనుమతితో సంబంధం లేకుండా పథకాన్ని వర్తింపజేయాలని సూచించారు.
ప్రస్తుతం 13,678 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అర్హత ఉన్న వారికి వారంలోగా ఆర్థిక సాయం అందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నెల 7న 71,536 మంది ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేసినట్లు కథనంలో పేర్కొన్నారు.

